మురసు తుఫాన్ ఎఫెక్ట్.. సూర్యాపేట జిల్లాకు భారీ వర్ష సూచన
ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్.
సూర్యాపేట:- మురసు తుఫాన్ ప్రభావంతో రాబోయే కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హెచ్చరించారు. సూర్యాపేట జిల్లావ్యాప్తంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా కోదాడ, హుజూర్‌నగర్ డివిజన్లలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. అవసరం లేని ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, అధికారుల సూచనలను అనుసరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమం లో అదనపు కలెక్టర్ బి. హరిసింగ్, డిఆర్ఓ ప్రేమ్ రాజు, డిపిఓ యాదగిరి, డిఎస్ఓ మోహనబాబు, అధికారులు తదితరులు పాల్గొన్నారు