జోగులాంబ గద్వాల3 నవంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఇటిక్యాల మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు మంగళవారం ఉదయం 11 గంటలకు ఏ పి ఓ. శరత్. అధ్యక్షతన ఇటిక్యాల &ఎర్రవల్లి మండలాలకు సంబంధించి మేటీలకు వి బి జి రామ్ పథకంపై శిక్షణ ఇవ్వడం జరిగింది. ఏపీఓ శరత్ మాట్లాడుతూ మార్క్ ఔట్ విధానం మరియు రోజువారి పని ప్రమాణాలను అర్థం చేసుకొని కూలీలకు వివరించగలగాలి. వర్తించే పని ప్రమాణాల ప్రకారము కూలీలు నోటిపై చేసిన వేతనం పొందేందుకు పని నిర్వహణలో సహకరించాలి. ఎన్.ఎం.ఎం.ఎస్/ ప్రభుత్వం నిర్దేశించిన వ్యవస్థ ద్వారా హాజరును సక్రమంగా నమోదు చేయడంలో సహకరించాలి.అర్హులైన కుటుంబాలకు125 రోజుల ఉపాధి హామీ లక్ష్యంగా సాధనలో సహకరించాలి. పనుల నాణ్యత కొలతలు పని ప్రదేశము సదుపాయాలను మరియు పారదర్శకంగా సంబంధించిన విధానాలను పాటించాలి. గిరిజన మరియు పి వి టి జి ఆవాసాలలో స్థానిక అవసరాలకు అనుకూలంగా పనుల ప్రణాళిక అమలులో సహకరించాలి. అని మేటీలకు అవగాహన కల్పించారు. ఎంపీడీవో మహేష్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం వివిధ గ్రామాలలో ఉన్న మేటీలు వారి వారి గ్రామాలలో వి బి జి రామ్ ఉపాధి పనుల గురించి వారి వారి గ్రామాలలో కూలీలకు అవగాహన కల్పించి ఉపాధి పనులకు వచ్చేటట్లు శ్రద్ధ తీసుకొని ఉపాధి పనులు చేయించాలని మేటీలను కోరారు. ఒక్క మేటి 40 మంది కూలీలకి ఒకరుగా ఉండి పని చేయించాలని మేటిలకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో, ఏపీవో. శరత్ సిబ్బంది ఇటిక్యాల ఎర్రవల్లి మండలాల మేటీలు పాల్గొన్నారు.