🏠 www.telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 13 October 2026, 4:33 am Posted by : Telangana Vaartha

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ

News Image
ఆడపడుచులకు ఎంగిలిపువ్వు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన 44వ వార్డు కౌన్సిలర్ గునగంటి హేమా సతీష్.
సూర్యాపేట:- సూర్యాపేట పట్టణంలోని సద్దల చెరువు వద్ద నిర్వహించిన ఎంగిలిపువ్వు బతుకమ్మ వేడుకల్లో 44వ వార్డు కౌన్సిలర్ గునగంటి హేమా సతీష్ పాల్గొని ఆడపడుచులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వ తరఫున బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు కల్పించినట్లు తెలిపారు. బతుకమ్మ వేడుకలకు విచ్చేసిన మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసిన మున్సిపల్ సిబ్బందిని, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసు శాఖ అధికారులను, సిబ్బందిని వారు అభినందించారు. తెలంగాణ ఆడపడుచులందరికీ ఎంగిలిపువ్వు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
🏠 Home