ఆర్టిసి ఎన్నికలలో టిఎం యు, ఇయు, ఎన్ ఎం యు జె ఎసిని అత్యదిక మెజారిటీతో గెలిపించాలి
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో టిఎం యు, ఇయు, ఎన్ ఎమ్ యు యూనియన్ జె ఎసి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జేఏసీ నాయకులు, టిఎంయు జనరల్ సెక్రెటరీ ధామస్ రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం సూర్యాపేట డిపోలో జరిగిన జేఏసీ ఎన్నికల ప్రచార సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో అసలైన యూనియన్ తమ జేఏసీ మాత్రమే అని , కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జె ఎసి ని గెలిపించాలని అన్నారు. తమ జేఏసీ తెలంగాణలో 10,000 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధిస్తుందని తెలిపారు. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. క్లాస్ 3 లో బస్సు గుర్తుకు క్లాస్ 6 లో నిచ్చెన గుర్తుకు ఓటు వేయాలని తెలియజేశారు. ధర్మానికి అదర్మానికి జరుగుతున్న ఎన్నికలలో ధర్మమే గెలుస్తుందని అన్నారు. ఎన్నికలు స్వేచ్చగా జరగాలని ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దని అన్నారు. కార్యక్రమంలో ఇయు రాష్ట్ర అద్యక్షులు బాబురావు, రహిముద్దిన్, మేకల శ్రీనివాసరావు, పాటి అప్పారావు, నరేందర్, రాఘవరెడ్డి, డివి రత్నం తదితరులు పాల్గొన్నారు .